ప్రశాంత వాతావరణం లో జరిగిన ఉపాద్యాయ ఎంయల్సి ఎన్నికలు
తాళ్ళపూడి, పెన్ పవర్తాళ్ళపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయ ఎం.యల్.సి ఎన్నికలు తాళ్ళపూడి తహశీల్దార్ మరియు ఎన్నికల సహాయ అధికారి ఎం.నరసింహమూర్తి పర్యవేక్షణ లో ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. తాళ్ళపూడి మండలం లో 61 మంది ఉపాద్యాయ ఓటర్లు ఉండగా 61 ఓటింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. అంటే 100 % ఓటింగ్ జరిగింది. డిటి రాజబాబు, ఎస్ఐ జి.సతీష్ ఎన్నికల నిర్వహణ లో భాద్యత వహించి ప్రశాంతంగా జరిగేలా నియమ, నిబంధనలు తీసుకున్నారు. ప్రిసైడింగ్ అధికారులు బ్యాలెట్ బాక్సులకు సీలు వేసి పూర్తి బందోబస్తు తో స్ట్రాంగ్ రూమ్ కు తరలించడం జరిగింది. ముందుగా బ్యాలెట్ బాక్సులను కొవ్వూరు తీసుకెళ్లి, తరువాత కాకినాడ జేయన్టీయు కాలేజ్ కు తరలిస్తారని అధికారులు తెలిపారు. 17 వ తారీఖున ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆర్ఐ క్రాంతిరేఖ, విఆర్వోలు లీలావతి, స్వర్ణ, మెడికల్ సిబ్బంది, పొలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment