Followers

నిందితులను అరెస్టు చేయాలంటూ హిందు వాహిని ఆధ్వర్యంలో రాస్తారోకో

 నిందితులను అరెస్టు చేయాలంటూ  హిందు వాహిని ఆధ్వర్యంలో రాస్తారోకో

 వనపర్తి, పెన్ పవర్

వనపర్తిలో హిందూ వాహిని ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి  విభాగ్ కో కన్వీనర్ అభిలాష్  హౌదే  కార్ ప్రసంగిస్తూ  ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో  ఉన్న హిందువుల పైన వారి ఆస్తుల పైన వ్యాపార సంస్థల పైన దాడులను ప్రోత్సహించే వారికి అండదండలు లు కల్పించి తరచుగా హిందువులపై దాడులు చేయాలని చూస్తున్నారని,  హిందువులను బలిపశువులను చేస్తున్నారని తెలిపారు. పదే పదే హిందువులపై జరుగుతున్న దాడులు జరుగుతున్నాయని చెప్పారు. దుండగులను వెంటనే అరెస్టు చేయాలి అరెస్టు చేసి క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ హిందువులపై పునరావృతం కావద్దని కోరారు.ధర్నా కార్యక్రమంలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది హిందు వాహిని కార్యకర్తలను  పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ అరుణ్ జిల్లా భేటీ బచావో ప్రముఖ సహా ప్రముఖ నవీన,పట్టణ అధ్యక్షుడు శివకృష్ణ,రోహిత్,గణేష్, ప రాకేష, మణిదీప్,చరణ్ ,ప్రేమ్ నందా, నీలేష్,నరేష్,సాయి, గిరీష్,తదితర హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...