ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గృహనిర్మాణాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గృహ నిర్మాణాలు జరగాలని గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పిడి)విశ్వేశ్వర ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు అమలులో భాగంగా చేపట్టిన గృహ నిర్మాణాలను తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం నర్శిపూడి, ఆలమూరు గ్రామాల్లో ప్రభుత్వఅధికారులు ఏర్పాటు చేసిన లేఅవుట్ లలో నిర్మిస్తున్న గృహాలను గృహ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గణపతి, డివిజనల్ ఇంజనీర్ జి శ్రీనివాస ప్రసాద్, ఏఈ జేజిబాబు, ఆలమూరు ఎంపీడీవో జేఏ జాన్సీ లతో కలిసి నిర్మాణాలను తనిఖీలు చేశారు.
మొదటి విడతగా ఆలమూరు ఎర్ర కోలనీలో 385 గృహాలకుగాను 302 గృహాలు మంజూరు కాగా, వాటిలో 11గృహల నిర్మాణంతో పాటుగా నర్సిపూడిలో ఒక గృహం నిర్మాణం చేపట్టినట్టు వారు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గృహ నిర్మాణం జరగాలని, ప్రభుత్వ లేఅవుట్లలో నిర్మించే సామూహిక గృహాలకు పునాదులు ఎత్తులో నిర్మిస్తే ఖర్చు అధికమవుతాయని గృహ నిర్మాణ సంస్థ అధికారులు నిర్ణయించిన కొలతల ప్రకారమే గృహ నిర్మాణాలు జరగాలని ఆయన అన్నారు. అనంతరం అమలాపురం డివిజన్ రావులపాలెంలో కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం మండలాల గృహ నిర్మాణాలపై ఆయా మండలాల ముఖ్య అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజినీర్లు పి దేవి, పీ నగేశ్, బి రోషిణి పలువురు అధికారులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment