Followers

క్లాసిక్ దాబా వద్ద యూటర్న్

 క్లాసిక్ దాబా వద్ద యూటర్న్ తెరిపించిన ఛైర్మన్...

పెన్ పవర్,మేడ్చల్

మేడ్చల్ పట్టణంలోని క్లాసిక్ దాబా వద్ద గల యూటర్న్ ను మూసివేయడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఈ యొక్క యూ టర్న్ మేడ్చల్ పట్టణ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఈ రోజు ఉదయం మేడ్చల్ మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ లో తెలియజేయడంతో మంత్రి మల్లారెడ్డి  తక్షణమే స్పందించి రవాణా శాఖ, ట్రాఫిక్ డిసిపి విజయ్ కుమార్ కి ఫోన్ చేసి యూటర్న్ ను తక్షణమే తీసివేయాలని ఆదేశించారు. ఈ విషయం పై స్పందించిన డిసిపి విజయ్ కుమార్,  అల్వాల్ డివిజనల్ ట్రాఫిక్ సిఐ రాజశేఖర్ రెడ్డికి, మేడ్చల్ సిఐ ఆదేశాలు ఇవ్వడంతో వారివురు వచ్చి మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్  మర్రి దీపిక నర్సింహ్మ రెడ్డి, కౌన్సిలర్స్ పెంజర్ల స్వామి యాదవ్, నడికప్పు ఉమా నాగరాజు ముదిరాజ్, కౌడే మహేష్ కురుమ, వీరమల్ల మానస శ్రావణ్ గుప్త‌‌‌, నారెడ్డి కృష్ణవేణి రవీందర్ రెడ్డి, జాకట దేవరాజ్, సముద్రం సాయి కుమార్, మేడ్చల్ పట్టణ మాజీ ఉప సర్పంచ్  మర్రి నర్సింహ్మరెడ్డి, మేడ్చల్ మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు  చెర్వుకొమ్ము శేఖర్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పానుగంటి రవీందర్, నడికొప్పు నాగరాజు ముదిరాజ్, మేడ్చల్ మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు  నీలిమ, వరలక్ష్మి, మోనార్క్, సన్నీ మరియ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...