పోలింగ్ కేంద్రాలకు స్ట్రాంగ్ రూమ్ కను పరిశీలించిన జె సి మరియు ఎస్ పి
పెన్ పవర్,కొవ్వూరుపశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం లోని పోలింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి కె. నారాయణ నాయక్.కొవ్వూరు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొవ్వూరు పట్టణం నందు సమస్యాత్మక,అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి, సదరు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును గురించి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ రెవిన్యూ ,పోలీస్ సిబ్బంది కలిసి ఎన్నికలు సామరస్యంగా, నిష్పక్షపాతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసాం.ఓటర్ల లందరూ అధికారుల ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తపరచారు.వారి యొక్క ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిర్భయంగా వినియోగించుకుంటున్నారు. ఎస్పీ నారాయణ నాయక్ మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారికి రాజ్యాంగబద్ధంగా లభించిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలాగా పోలీసు రక్షణ ఏర్పాట్లు చేశారు.కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి.పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చే గర్భిణీ స్త్రీలు, వికలాంగులు మరియు వృద్ధులకు పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తూ ఎలక్షన్ కమిషన్ వారి యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారు.అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరుచు స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించి ఆక్కడ మున్సిపల్, రెవిన్యూ, పోలీసు సిబ్బంది సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లుగా తెలియజేసినారు.జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ నారాయణ నాయక్ తో పాటు కొవ్వూరు రెవిన్యూ డివిజనల్ అధికారి డి. లక్ష్మారెడ్డి ,ఎస్సీ ఎస్టీ సెల్ 1 డిఎస్పీ ఏ.శ్రీనివాసరావు, కొవ్వూరు టౌన్ సీఐ ఎం. వి. వి. ఎస్. ఎన్. మూర్తి, కొవ్వూరు టౌన్ ఎస్సై లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


No comments:
Post a Comment