సమస్యల పరిష్కారానికి మార్నింగ్ వాక్
ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్
అదిలాబాద్,పెన్ పవర్
గ్రామాల్లో సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు పల్లెనిద్ర సమస్యల పరిష్కారం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడం జరిగిందని జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఉన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని చోర్ గావ్ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గ్రామంలోని ని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లెనిద్ర చేశారు. ఉదయం పంచాయతీలోని గొండుగూడ గ్రామంలో మార్నింగ్ వాక్ లో ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పనితీరు సంక్షేమ పథకాల అమలు ప్రజలకు చేరుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిరు పేద ప్రజలు రైతుల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందన్నారు. వాటిని సరైన పద్ధతిలో వినియోగించుకోవాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా నీరు అందుతుందా అడిగారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసమే పల్లెనిద్ర సమస్యల పరిష్కారం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లో నా యకులు కనక ప్రభాకర్, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ జాదవ్, సర్పంచ్ అనూష, గ్రామస్తులు శ్రీరామ్ మహారాజ్, భగత్ సింగ్, రమేష్ దుర్గ్రే, మహేందర్, కాంతారావు తదితరులు ఉన్నారు.

No comments:
Post a Comment