అమరజీవి త్యాగం తెలుగు ప్రజల కు స్ఫూర్తి
పెద్దాపురం,పెన్ పవర్
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు ప్రజలకు స్ఫూర్తి నిస్తుం దని ఆర్డీవో ఎస్. మల్లిబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి రెవిన్యూ డివిజనల్ అధికారి ఎస్ మల్లిబాబు పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన మహోన్నత వ్యక్తిని కొనియాడారు, ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ నిర్వహణ అధికారి ఇంచార్జ్ రామ్కుమార్,డిప్యూటీతాసిల్దారు భాను కార్యాలయసిబ్బంది తదితరులు నివాళఅర్పించినవారిలోఉన్నారు.అదేవిధంగాపెద్దాపురంమండలప్రజాపరిషత్కార్యాలయంలోనూ ఎంపీడీవో రమణ రెడ్డిపొట్టిశ్రీరాములుచిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

No comments:
Post a Comment