పారదర్శకంగా/ కౌన్సిలింగ్ ద్వారా మంచిర్యాల జిల్లా సివిల్ పోలీసు సిబ్బంది బదిలీలు
మంచిర్యాల , పెన్ పవర్
రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో రామగుండం కమీషనరేట్ పరిధిలో పనిచేయుచున్న మంచిర్యాల జిల్లా సివిల్ సిబ్బంది ఏఎస్ ఐ /హెడ్ కాన్స్టేబుల్ /కానిస్టేబుల్ మొత్తం 61మంది సిబ్బందికి పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఐపిఎస్ కౌన్సిలింగ్ నిర్వహించి, వారి స్యమస్యలు అడిగి తెలుసుకొని కమీషనరేట్ మంచిర్యాల జిల్లా పరిధిలో కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇచ్చారు.అనంతరం సిపి మాట్లాడుతూ అధికారులతో సమన్వయంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రజలతొ మంచి సత్ససంబందాలను ఏర్పాటు చేసుకుని, ప్రతి ఒక్కరూ నిజాయితీతో పనిచేసి పోలీస్ డిపార్ట్ మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిపి మంచిర్యాల ఉదయ్ కుమార్ అడిషనల్ డిసిపి ఏఆర్ కమాండెంట్ సంజీవ్, సుందర్ రావు,ఏసీపీ ట్రాఫిక్ బాలరాజు,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు నారాయణ, సతీష్,ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్ కుమార్,బాబు రావు, కుమారుస్వామి,ఆర్ ఐ లు మధుకర్,అనిల్,శ్రీధర్, విష్ణు,సీపీఓ సిబ్బంది సూపరిండెంట్ శ్రీనివాస్,సీనియర్ అసిస్టెంట్ పోతారాజు రామగుండం పోలీస్ సంఘము అధ్యక్షులు పోచలింగం పాల్గోన్నారు.



No comments:
Post a Comment