Followers

ప్రభుత్వ రంగం మా భవిష్యత్తు...వాటి జోలికొస్తే సహించేది లేదు

 ప్రభుత్వ రంగం మా భవిష్యత్తు...వాటి జోలికొస్తే సహించేది లేదు

ఎస్ఎఫ్ఐ, గిరిజన సంఘం సిఐటియు, ఆగ్రహం

జీవో నెంబర్ 3 రిజర్వేషన్ పునరుద్ధరణ చేయాలని

 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని 

పెన్ పవర్ బ్యూరో,విశాఖపట్నం

ఎస్సి ఎస్టి బిసి రిజర్వేషన్ల రద్దు నిర్ణయాలను మానుకోవాలని బుధవారం పెదబయలు మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ గిరిజన సంఘం సిఐటియు ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ మానవహారం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని  ఉద్దేశించి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ పరిశ్రమలను బ్యాంకులను రక్షణ భీమా రైల్వే తదితర సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం పచ్చి దుర్మార్గమైనదని కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు  రాష్ట్ర ప్రభుత్వం సమర్థించడం రాష్ట్ర ప్రజలను వంచించడమేనని బిజెపి తీసుకుంటున్న అప్రజాస్వామిక విధానాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం   చిత్తశుద్ధి గా వ్యవహరించాలని సూచించారు. చేతనైతే కొత్త పరిశ్రమలు స్థాపించాలి అంతే తప్ప అనేక త్యాగాలు చేసి ఇ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి సాధించుకున్న  స్టీల్ ప్లాంట్ వంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు అమ్మే అధికారం ఈ ప్రభుత్వానికి లేదని మొండిగా వ్యవహరిస్తే దేశ ప్రజల ఆగ్రహ జ్వాలలకు కాలి బూడిదై పోక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గిరిజన సంఘం మాజీ  రాష్ట్ర కమిటీ సభ్యులు బొండ సన్ని బాబు మాట్లాడుతూ.... దేశా సంపదను కొల్లగొట్టే వ్యవహారంలో భాగంగా దేశానికి సంబంధించిన అతి పెద్ద 100 పరిశ్రమలను అంబానీ ఆధాని లకు విదేశీ బహుళజాతి కంపెనీలకు అమ్మేసి కులా మతాల మధ్య చిచ్చులు రెచ్చగొట్టి దేశాన్ని అల్లకల్లోలం చేయాలని కంకణం కట్టుకున్న ఈ బిజెపి విధానాలను కూకటి వేళ్లతో పెకిలించే ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు సింహాద్రి పెదబయలు ఎస్ఎఫ్ఐ కమిటీ సభ్యులు రామదాసు వీరన్న వెంకటేష్ భీమరాజు సిఐటియు మండల కార్యదర్శి  కే.సర బన్న తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...