లొల్ల పాఠశాలలో మద్యాహ్న భోజనం పరిశీలించిన ఎంపీడీఒ
పెన్ పవర్,ఆత్రేయపురం
లొల్ల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మద్యాహ్న భోజన పథకాన్ని ఆత్రేయపురం ఎంపీడీఒ నాతి బుజ్జి పరిశీలించారు. పాఠశాలలో భోజన పథకం అమలు, టాయిలెట్ల సదుపాయం, పదవ తరగతి పాఠ్యాంశాల భోదన, పరీక్షలకు సమాయత్తమవుతున్న విధానం తదితర అంశాలపై పదవ తరగతి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం రుచికరం,శుచి కరమైన భోజనం పిల్లలకు తయారు చేసి పెట్టాలని ఇంప్లిమెంటింగ్ ఏజన్సీ వారిని ఆదేశించారు. ఈ పరిశీలనలో పాఠశాల ప్రదానోపాద్యాయులు అంగర రాజు, ఉపాద్యాయులు ఉన్నారు.అనంతరం గ్రామ సచివాలయాన్ని పరిశీలించి, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లతో సమావేశం నిర్వహించి సచివాలయ సర్వీసులు, సచివాలయ సిబ్బంది చేయాల్సిన తనిఖీలు , సంక్షేమ పధకాల అమలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశం లో కార్యదర్శి విజయ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.ఇటీవల ఉత్తమ అధికారిణి గా అవార్డు అందుకున్న సందర్భంగా లొల్ల గ్రామ సచివాలయ సిబ్బంది,గ్రామ వాలంటీర్లు గ్రామ పెద్దలు తూము తాతాజీ, డి.సూర్యనారాయణ రాజు, వార్డు సభ్యులు,ఉపాద్యాయులు బెనర్జీ, దేవకుమార్, ఎ.రాజు తదితరులు ఎంపీడీఒ ను సత్కరించారు.

No comments:
Post a Comment