Followers

ఫారెస్ట్ అధికారుల ట్రెంచ్ పనులను అడ్డుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్

 ఫారెస్ట్ అధికారుల ట్రెంచ్ పనులను అడ్డుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్...


పెన్ పవర్,  బయ్యారం

ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లాపరిషత్ చైర్మెన్..ఫోడుభూములకు ట్రెంచ్ పనులు నిలిపివేయాలని చైర్మెన్ అంగోత్ బిందు అధికారులను నిలదీశారు..మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రమచంద్రాపురం గ్రామపంచాయతీ పందిపడే గ్రామంలో గిరిజనులు సాగు చేస్తున్న పట్టా భూముల్లో ఫారెస్ట్ అధికారులు మంగళవారం ట్రెంచ్ కొట్టి సాగు చేస్తున్న భూములను లాక్కోవడంపై గిరిజనులు ఆందోళన చేసి మహబూబాబాద్‌ జిల్లాపరిషత్ చైర్ పర్సన్ కు, పిర్యాదు చేయడంతో.. అంగోత్ బిందు చైర్ పర్సన్, వెంటనే పందిపడే గ్రామంలో జరుగుతున్న ట్రెంచ్ పనుల పరిశీలనకై వెళ్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. బానోత్ రంగమ్మ..జాటోత్ పూలమ్మ.., కమలమ్మలకు.. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పట్టా పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ.. సాగుచేయనీయకుండా భూముల్లో ట్రెంచ్ ఎలా కొడుతున్నారని అంగోత్ బిందు ఫారెస్ట్ అధికారులను నిలదీశారు.. తాము జిల్లా ఫారెస్ట్ అధికారుల ఆదేశానుసారము పనులు చేస్తున్నామని అటవీశాఖ అధిజారులు తెలుపడంతో..జిల్లాపరిషత్ చైర్ పర్సన్ బిందు ఆగ్రహంతో జిల్లా ఫారెస్ట్ అధికారికి ఫోన్ చేసి పట్టాలు ఉన్న భూముల్లో ట్రెంచ్ పనులు ఎలా చేస్తున్నారని వెంటనే పనులు నిలిపివేయాలని ఆగ్రహించడంతో..అటవీశాఖ అధికారులు అంగీకరించి ట్రెంచ్ పనులు నిలిపివేశారు.. ఈ సందర్బంగా మహబూబాబాద్‌ జిల్లాపరిషత్ చైర్ పర్సన్ అంగోత్ బిందు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చిన మేరకు 2005 కు పూర్వము పోడు చేసిన సాగు భూముల, ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారని.. వారి హామీ మేరకు పోడు పట్టాల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఫారెస్ట్ అధికారులు ఎవ్వరు కూడా సాగు భూముల్లో ట్రెంచ్ పనులను చేపట్టవద్దని ఫారెస్ట్ అధికారులకు సూచించారు.., ఈ విషయమై జిల్లా మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ ద్వారా సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తామని, త్వరలో అందరూ ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఫారెస్ట్ అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి పొడు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని,, పందిపడే గ్రామ గిరిజన పొడు రైతులకు చైర్మెన్ హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో బయ్యారం పిఏసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, రమచంద్రాపురం సర్పంచ్ పోలెబోయిన వెంకటేశ్వర్లు, బయ్యారం మండల ఫారెస్ట్ అధికారులు, గిరిజన రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...