Followers

స్వామివారి కృపతో అందరూ బాగుండాలి

 స్వామివారి కృపతో అందరూ బాగుండాలి

కూకట్ పల్లి, పెన్ పవర్

మల్లిఖార్జున స్వామీ, ఎల్లమ్మ తల్లీ ఆశీస్సులు అందరిపై ఉండాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్, పట్టభద్రుల జేఏసీ రాష్ట్ర సలహాదారులు గొట్టిముక్కుల పాండురంగారావు. మంగళవారం కూకట్ పల్లి మల్లిఖార్జున స్వామీ, రేణుక ఎల్లమ్మ  తల్లీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమానికి పాండురంగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామీ, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈసందర్భంగా పాండురంగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంకా కరోన భయాలు పోలేదని, ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ భయపడుతు బ్రతుకుతున్నారని, స్వామీ అమ్మవారల ఆశీర్వాదాలతో కరోన వైరస్ పోవాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...