కరోనా నిబంధనలు పాటించని "మార్టిన్స్" పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి
...జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేత
మంచిర్యాల , పెన్ పవర్భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖధికారి కార్యాలయంలోని డీ ఈ ఓ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడితూ మంచిర్యాల జిల్లా లోని సిసిసి కార్నర్లో ఉన్న మార్టిన్స్ అను ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆరో తరగతి నుంచి తరగతులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మాత్రం ఎల్కేజి,నుంచి 5తరగతి వరకు తరగతులు నడిపిస్తూ ఒకే గదిలో 30 నుంచి 40 మందిని కూర్చోబెట్టి తరగతులు బోధిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు సిబ్బందికి కరోనా వస్తుందన్నారు. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు పాటించకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మార్టిన్స్ పాఠశాల యొక్క గుర్తింపు రద్దు చేయాలని, ఫీజుల పేరుతోటి విద్యార్థులను వారి తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తూ అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి సంఘం గా డిమాండ్ చేస్తున్నామని, లేనియెడల జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పవన్ కళ్యాణ్,శ్రీనివాస్, అజయ్ పాల్గొన్నారు.

No comments:
Post a Comment