పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన సిపి సజ్జనర్
కూకట్ పల్లి,పెన్ పవర్ఆదివారం జరిగిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా కూకట్ పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తనిఖీ చేశారు. ఓటు వేయడానికి క్యూ లైన్లలో నిలబడినవారికి అభివాదం చేస్తూ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో వయో వృద్దులు నిలబడి ఉండటాన్ని గమనించిన ఆయన వారు కూర్చోడానికి కుర్చీలు, ఎండ తగలకుండా టెంట్ లు ఏర్పాటు చేయాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నుటయాభై పోలింగ్ కేంద్రాల నుండి లక్ష ఇరవై రెండు వేల ఏడువందల డెభై నాలుగు మంది పట్టభద్రులు తమ ఓటు నమోదు చేసుకున్నరని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సజ్జనార్ అభ్యర్ధించారు.
తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు వేసి ప్రజాస్వామ్యని గెలిపించాలని, గత ఎన్నికల్లో 34 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, పట్టభద్రులు అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెలియజేసారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలియజేసారు. ఈకార్యక్రమంలో మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు, కూకట్ పల్లి ఏసిపి, భుజంగరావు, కూకట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావు, ఎస్.ఐ సురేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


No comments:
Post a Comment