ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస బీజేపీ నాయకులమధ్య ఘర్షణ
బీజేపీ నాయకులు రోడ్డు పై బైఠా యుంపుఎస్పీ రాకతో సద్దు మణిగిన అల్లరి
నెల్లికుదురు,పెన్ పవర్
మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో ఆదివారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస బీజేపీ నాయకులమధ్య తోపులాట జరిగింది.మండలకేంద్రానికి సమీపంలో నెల్లికుదురు, మహుబూబాద్ ప్రధాన రహదారికి సమీపంలోఉన్న ఫంక్షన్ హాల్ లో తెరాస కార్యకర్తలు ఓటర్స్ కు డబ్బులు పంచుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్ బీజేపీ కార్యకర్తలతో అక్కడికి చేరుకోగా అక్కడ ఉన్న తెరాస కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలతో గొడవపడి ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది
ఈ విషయం తెలుకున్న బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని నెల్లికుదురు మహుబూబాద్ ప్రధానరహదారిపై హుస్సేన్ నాయక్ ప్రేమేందర్రెడ్డితొ కలిసి బైఠాయుoచి తెరాస కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కడినుండి పంపించి వేశారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు తెరాస నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు కొద్దిసేపు ఆందోళనకు దిగారు.


No comments:
Post a Comment