Followers

గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ కు నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సబ్యులకు(కార్పొరేటర్లు) లకు శుభాకాంక్షలు -సీపీఐ

 గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ కు నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సబ్యులకు(కార్పొరేటర్లు) లకు శుభాకాంక్షలు -సీపీఐ

విశాఖపట్నం సిటీ, పెన్ పవర్

నగర పేద మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు పరిస్కారానికి కృషి చేయాలి.విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదటి సమావేశంలో తీర్మానం చెయ్యాలి.విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణ చేసి తీరుతామని,ఇందులో ఎలాంటి సందేహం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను ఖండిస్తూ జీవీఎంసీ కి ఎన్నికైన నూతన పాలకవర్గం ప్రమాణం చేసిన వెంటనే తీర్మాణం చెయ్యాలని సీపీఐ విజ్ఞప్తి చేసింది.సీపీఐ నగర కార్యదర్శి ఎం పైడిరాజు మంగళవారం సీపీఐ తరుపున పత్రికా ప్రకటనవిడుదల చేశారు.ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగల ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను నేడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడానికి సన్నాహాలు చేస్తూనే తాజాగా వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణ చేసి తీరుతామని కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించడం చూస్తే బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా వ్యవహారిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ నిర్ణయాన్ని ఆడ్డుకోవాల్సిన రాష్ట్ర అధికార పక్షం వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రెండు గోరంగా వైఫల్యం చెందాయని ఆరోపిస్తూ మరో పక్క జనసేన పార్టీ నాయకత్వం కూడా బీజేపీ నిర్ణయాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నారని విమర్శించారు. గురువారం గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ కు నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రమాణం, ప్రధమ పౌరుడు, ఉప ప్రధమ పౌరుడు ఎంపికైన వెంటనే మొదటి పాలకవర్గ సమావేశంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...