Followers

భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో యువత మేల్కోవాలి

 భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో యువత మేల్కోవాలి 

ఎం.సి.పి.ఐ(యు)జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ పిలుపు 

బెల్లంపల్లి , పెన్ పవర్ 

భగత్ సింగ్ 90 వ.వర్ధంతిని  పురస్కరించుకొని బెల్లంపల్లి లోని రామాటాకీస్ ముందుగల భగత్ సింగ్ విగ్రహానికి ఎం. సి. పి ఐ యూ జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ పూలమాలవేసి, 90 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ భారతమాత దాస్య శృంఖలాలను బద్దలుకొట్టి,బ్రిటిష్ తెల్లదొరలను తరిమికొట్టి ,దేశానికి స్వాతంత్రం తేవడానికి నూనూగు మీసాల వయసులో నే ఉద్యమాల బాట పట్టి .ఆనాడు పార్లమెంట్ పై దాడి చేసి చిరుప్రాయంలోనే (23,సంవత్సరాలు ).ఉరితాళ్లను  ముద్దాడిన యువకిశోరం నేటి యువతకు స్ఫూర్తి దాత ,భగత్సింగ్ ఆశయ బాటలో పయనించిన అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వాళ్లమవుతాం అని,మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు,దేశ వ్యాప్తంగా ఎం.సి.పి.ఐ (యు) నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ. ఎఫ్.డి.వై జిల్లా కార్యదర్శి పసుపులేటి వెంకటేష్ ఏ.ఐ.సి.టి.యు  జిల్లా అధ్యక్షులు కొండ శ్రీనివాస్, ఏ.ఐ.ఎఫ్.డి.ఎస్ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్,అరుణ్,ఆకాష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...