శివాలయాలను దర్శించుకున్న ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా పవర్ దంపతులు...
ఆదిలాబాద్ , పెన్ పవర్
మహాశివరాత్రిని పురస్కరించుకొని గురువారం ఆదిలాబాద్ లోని వాల్మీకి నగర్ లో గల శివాలయం, జైనథ్ మండలం లోని గూడా, కోరాట గ్రామాల్లో ని శివాలయ ఆలయాల్లో ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా పవన్ రావు టిఆర్ఎస్ నాయకులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలకు, రైతులకు అంతా మంచి జరగాలని కోరారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి వెళ్లినా మాజీ మున్సిపల్ చైర్మన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు వార్డు సభ్యులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment