గుట్కా..అంబర్ల విక్రయాలను అరికట్టండి..
పట్టణం..గ్రామాలలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న నిషేదిత గుట్కా,అంబర్ ప్యాకెట్లు..
కుటుంబాలకు కుటుంబాలే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది
కేసముద్రం, పెన్ పవర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ప్రాణాలు కాపాడడం కోసం కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న టొబాకో మహమ్మారిని చట్ట ప్రకారంగా నిషేధించగా ,రాష్ట్రంలో దుష్ట శక్తులు ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి, తమ సంపాదనే ధ్యేయంగా పనిగా పెట్టుకొని, తోబాకో, తంబాకు, పాన్ పరాగ్, విమల్, గుట్కా ల, రూపంలో రాష్ట్ర నడిబొడ్డు నుండి గ్రామాలలో వీధులలో ఉండే చిన్న చిన్న కిరాణా షాప్ లోకి పాన్ షాప్ లోకి సప్లై చేస్తూ కోటీశ్వరులు అవుతాన్నారు ,ఎంతలా ఎగిసి పడుతుంది ఈ రాకెట్ మహమ్మారి అంటే ,గతంలో ఒక్క రూపాయి కి దొరికే గుట్కా ఒక్క ప్యాకెట్ , నేడు ఆ ఒక్క ప్యాకెట్ ను ఐదు రూపాయల నుండి 10 రూపాలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు, మూడు నుండి ఐదు రూపాయలు గతంలో ఆమ్మీ నటువంటి తంబాకు( అంబర్ ) ప్యాకెట్ నేడు 15 నుండి 20, 25 రూపాయలు కూడా అమ్ముతున్నారు సగటున పేద మధ్యతరగతి ప్రజలు కూలీలు, ఎక్కువగా వీటికి అలవాటు పడి విరివిగా వీటిని వాడుతున్నారు కొంతమంది యువకులు ఫ్యాషన్ గా గా కూడా వీటిని వాడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు ,వీటికి చదువుకున్నవారు చదువులేని వారు అనే తేడా లేకుండా ప్రతి పది మందిలో ఇద్దరు ముగ్గురు వీటికి బానిసలుగా మారిపోతున్నారు, ఎంతలా అంటే అన్నం లేకుండా ఉంటారు కానీ అంబర్ గుట్కా తినకుండా ఉండలేనంతగా బానిస గా మారి పోయారు దీనిని ఆసరాగా చేసుకున్న రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి మండలస్థాయి గ్రామస్థాయి లో ఏజెంట్లుగా పెట్టుకొని సప్లై చేస్తూ ,సీక్రెట్ గా గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారు ప్రతి పాన్ షాప్ లో ఇవి లేవు అని అంటే నమ్మశక్యం లేని మాటలు, ఒకటి నుండి మూడు నాలుగు ప్యాకెట్ల వరకు ప్రతి షాప్ వాళ్ళు రిటైల్గా అమ్ముతున్నారు ,దీనికి అధికారులు ప్రజా ప్రతినిధులు తెలిసి కూడా తెలియనట్టు గా ఉంటున్నారు, ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను గుర్తుపెట్టుకుని చట్ట ప్రకారంగా నిర్మూలించిన టువంటి గుట్కా ప్యాకెట్ల అమ్మకాలను సమూలంగా నిర్మూలించేందుకు ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ తీసుకోవాలని లేనట్లయితే ప్రతి పది మందిలో ఇద్దరు ముగ్గురు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు పెరిగే ప్రమాదం ఉందని ప్రతి మండలంలో ఒకరిద్దరు ఇప్పటికే ఉన్నారని మేధావి వర్గాలు చర్చించుకుంటున్నారు పెన్ పవర్ చేపట్టిన అటువంటి పరిశోధనలొ అధికారులకు తెలుసునని గతంలో కొంతమంది హోల్సేల్ డీలర్ల కిరానా షాప్ వాళ్లను పట్టుకొని చిన్న చిన్న కేసులతో వదిలేశారని ఇది మా మామూలే అని అంటున్నారు , ఈ అమ్మకాలు ఈ విధంగానే జరుగుతే కొద్ది ఏండ్లకే కొన్ని సంవత్సరాలలో పేద ప్రజలు మరింత దరిద్ర అనే ఊబిలోకి పోతారని మరీ ముఖ్యంగా ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యం పాలవుతానరని ,ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తింటే ఆ కుటుంబం అంతా ఆ వాసన సోకి వారందరూ కూడా అనారోగ్యం పాలవుతారు అని *ఒక ఆయుర్వేద వైద్యుడు తెలియజేశారు* ఇది ఇలాగే కొనసాగితే కుటుంబాలకు కుటుంబాలే అనారోగ్యం పాలవుతారు క్యాన్సర్ మహమ్మారి కౌగిలిలో బందీ అవుతారని ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రజా ప్రతినిధులు కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి టొబాకో ప్యాకెట్లను నిర్మూలించేందుకు కంకణం కట్టుకోవాలని అందుకు ప్రజలు ,స్వచ్ఛంద సంస్థలు, మేధావులు ,కూడా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు కూడా నడుం బిగించాలనని వైద్యులు అంటున్నారు, ఎవరు ఎంత పని చేసి ఇ ప్రజల ప్రాణాలను ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని పని చేసి ప్రజల కోసం పాటు పడి యోగక్షేమాలను ఆలోచించి ఈ గుట్కా తంబాకు అంబర్ లాను నిషేధించేందుకు పాటుపడతారొ వేచి చూద్దాం.



No comments:
Post a Comment