కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన ఆర్టీసీ కార్మికులు
వనపర్తి, పెన్ పవర్టి.ఎస్.ఆర్.టి.సి వనపర్తి డిపోలో రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి దాదాపు మూడు వేల కోట్లు కేటాయించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ డిపో మేనేజర్ శ్రీ కె.వి. రాజశేఖర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఉద్యోగులు పాలాభిషేకం చేసినారు. డిపో మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధికి సీఎం కెసిఆర్ ఇస్తున్న చేయూత గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి, ఎఎంఎఫ్ జయ కృష్ణ, ఎస్.టి.ఐ. శ్రీలత, ఉద్యోగులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment