వైసిపి జిల్లా కార్యదర్శి తోట ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తాళ్ళపూడి, పెన్ పవర్రాష్ట్ర మహిళ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ తానేటి వనిత ఆదేశాల మేరకు తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి మరియు వైస్ ప్రెసిడెంట్ తోట రామకృష్ణ ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పూర్తిచేసుకుని 11 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంలో పెద్దేవం సినిమా హాల్ సెంటర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద పూలమాలవేసి ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. అనంతరం తోట రామకృష్ణ మాట్లాడుతూ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఎనలేని సేవలు రాష్ట్ర ప్రజలకు అందజేస్తున్న ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎన్నడూ చూడలేదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్దేవం గ్రామ ప్రెసిడెంట్ తిగిరిపల్లివెంకటరావు, గ్రామకమిటీ అధ్యక్షులు నరాల శెట్టి వీర వెంకట్రావు, వార్డు మెంబర్లు తిగిరిపల్లి రమేష్, యండపల్లి లక్ష్మణరావు, స్వర్ణకుమారి, కంకిపాటి రవి, వైఎస్ఆర్సీపీ నాయకులు వేము రామారావు, నల్లాకుల వేణు, కోడి గంగారావు, బెజవాడ వీర్రాజు, యండపల్లి పెద్దకాపు, చామకూర సత్యనారాయణ, ఇంటి వెంకటేశ్వర్లు, యండపల్లి కృష్ణార్జునులు, కవల నాగేశ్వరరావు, జొన్నకూటి పోసిరాజు, పేరుగుల వీర్రాజు, నామన వెంకటేశ్వరరావు,గెడ్డం వెంకటేశ్వరరావు, మరియు కార్యకర్తలు, అభిమానులు, గ్రామ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా పెద్దేవం హై స్కూల్ లో మిడ్ డే మీల్స్ లో స్కూల్ పిల్లలకు స్వీట్లు పంచి పెట్టి వాళ్లతో కలిసి భోజనం చేసిన ప్రెసిడెంట్ తిగిరిపల్లి వెంకట్రావు, వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి మరియు వైస్ ప్రెసిడెంట్ తోట రామకృష్ణ, మరియు వైఎస్ఆర్సిపి నాయకులు.

No comments:
Post a Comment