ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు
అదిలాబాద్, పెన్ పవర్
మండల కేంద్రంలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 124వ వర్థంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కర్యవర్గ సభ్యులు రాజన్లవార్ సునీల్,దమాల నందు మాట్లాడుతూ.బాల్యవివాహాలు,అంటరానితనం, సతిసహగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.ఆమె రచనలు స్తెతం మహిళల్లో చైతన్యని నింపాయని నేటి మహిళలు ఆమె స్పూర్తితో తమ సమస్యలపై పోరాడాలని పిలుపు నిచ్చారు. సావిత్రిబాయి పాఠశాలకు వెళ్లే క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదుర్తెనా బాధలను ఎదుర్కొని స్త్రీలకు చదువు నేర్పా మొదటి మహిళగా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా ఎస్ ఎఫ్ డి కన్వీనర్ మడవార్ హరీష్,మండల అధ్యక్షుడు ఓం ప్రకాష్,అజయ్,సాయి,మనోజ్ రెడ్డి,ప్రీతం,తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment