ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లలో సీట్లు సంఖ్య పెంచాలి
పెన్ పవర్,విశాఖపట్నం
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచాలని ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ డిగ్రీ లో ప్రవేశం కల్పించాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది.బుధవారం జిల్లా గిరిజన విద్యార్థి సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి మరియు ఆంధ్ర యూనివర్సిటీ ఆదేశాల మేరకు జారీచేసిన షెడ్యూల్ ప్రకారం, బి.ఏ. బీకాం .బీఎస్సీ గ్రూపుల్లో చేరేందుకు ఆన్లైన్ లో విద్యార్ధులు,దరఖాస్తులు చేసుకున్నారు. ఇంటర్మీడియట్ ప్రెస్ రిలీజ్ అయిన విద్యార్థిని విద్యార్థులు ఆయా ప్రాంతాల్లో ఉన్న డిగ్రీ కళాశాలల్లోనే ఆన్ లైన్ చేసుకోవడం జరిగింది.విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో వేలాది మంది ఇంటర్ మీడియట్ విద్యార్థినీ విద్యార్థులు అరకొర సీట్ల పై ఆందోళన చెందుతున్నారు.ఆన్ లైన్ చేసుకున్న పేద గిిరిజన విద్యార్థులకు డిగ్రీ కళాశాలలో సీట్లు పెంచి చదువుకునే అవకాశం కల్పించాలి. కావున డిగ్రీ కళాశాలల్లో ప్రతి గ్రూప్ కి కనీసం 60 సీట్లు అయిన పెంచాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ చదువుకోడానికి వీలు కలుగుతుంది.ముఖ్యంగా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఎక్కువమంది ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసు కోవడం జరిగింది.ఈ కళాశాలల్లో సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. కావున ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి డిగ్రీ కళాశాలలో ఉన్న బిఏ.బికాం.బీఎస్సీ గ్రూపు ల సీట్ల ను పెంచి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థుల. కు ప్రభుత్వ కళాశాలలో చదువుకునే అవకాశం కల్పించాలి.లేని ఎడల విద్యార్థులు చదువుకు దూర మై చెడువ్యసనాలకు బానిసలు అవుతారు.కావున ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని కోరుతున్నారు.ఈ సమస్య పాడేరు ఐటిడిఏ పీఓ దృష్టి కి తీసుకు వెల్లగా ఆయన స్పందించి విద్యార్థులు అందరికీ చదువుకునే వెసులుబాటు కల్పిస్తామని హమి ఇచ్చినట్లు విద్యార్థి సంఘం తెలిపింది.గిరిజన విద్యాసర్థి సంఘం జి ఎస్ యుఫ జిసల్లాఅధ్యక్షులు బుడిదే సుమన్. మాజీ అధ్యక్షుడు కిషోర్ కిరశని సాయినాథ్ గొల్లోరి, సత్య నారాయణ తమర్భా రమేష్ విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment