Followers

ఆయుర్వేద వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

 ఆయుర్వేద వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

మందమర్రి , పెన్ పవర్ 

సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మార్చి 17న మందమర్రి ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో నిర్వహించు ఆయుర్వేద వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏరియా ఇంచార్జ్ పర్సనల్ మేనేజర్ సోమవారం ప్రకటనలో కోరారు. హైదరాబాద్ కు చెందిన మాతా రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద్ వైద్యుడు విశ్వనాథ మహర్షి ఆద్వర్యంలో  అన్ని రకాల వ్యాధులకు వైద్య శిబిరంలో చికిత్స చేయబడునని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఉదయం10గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు వైద్య శిబిరానికి గతంలో హాజరు అయిన వారు, క్రొత్తగా వైద్యం కోసం వచ్చే వారు, అందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...