Followers

నిర్విఘ్నంగా లారి అసోసియేషన్ ఎన్నికలు

 నిర్విఘ్నంగా లారి అసోసియేషన్ ఎన్నికలు

మందమర్రి,పెన్ పవర్ 

కోల్ బెల్ట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం మందమర్రి పట్టణంలోని ఇందూ గార్డెన్ లో నిర్విఘ్నంగా జరిగాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం సైతం మందమర్రి, శ్రీరాంపూర్ రెండు డివిజన్ లకు  ఎన్నికల నిర్వహిస్తామని అసోసియేషన్ అడహక్ కమిటీ చైర్మన్ మారపల్లి రవీందర్ పేర్కొన్నారు. గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ కారణంగా ఎన్నికలు నిర్వహింలేక పోవడంతో అడహక్ కమిటీని ఏర్పాటు చేసి, ఈ సంవత్సరం యథావిధిగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అసోసియేషన్ లో 272 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండగా, 16 మంది సభ్యులు పోటీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. శనివారం  పోస్టల్ బ్యాలెట్ ద్వారా దూర ప్రాంత సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...