Followers

కరాటే ఓవరాల్ చాంపియన్ ట్రోఫీ ఆవిష్కరణ

 కరాటే ఓవరాల్ చాంపియన్ ట్రోఫీ ఆవిష్కరణ

సామర్లకోట, పెన్ పవర్ 

సామర్లకోట పట్టణంలో ఏప్రిల్ 18వ తేదీన నిర్వహించనున్న కరాటే సౌత్ జోన్ గోర్నంమెంటుకు చెందిన ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక లయన్స్ కలబ్ భవనంలో శనివారం నిర్వహించారు. కరాటే పాఠశాల కోచ్ ది శంకర్రావు ఆధ్వర్యంలో ఇటీవల కరాటే బెల్ట్ గ్రేడింగు పరీక్షలు రాజమహేంద్రవరంలో నిర్వహించగా దానిలో ప్రతిభను కనపరిచిన 34 మంది విద్యార్థులకు ప్రమోషన్ బెల్టులు, సర్టిఫికేట్ల పంపిణీతో ఏప్రిల్ నెలలో స్థానిక గాంధీబొమ్మ సెంటర్లోని రైతు భవనంలో నిర్వహించే సౌత్ జోన్ కరాటే టర్నమెటు ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రఫీ ఆవష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. దానిలో ముఖ్య అతిధులుగా లయన్స్ క్లబ్ జిల్లాచైర్ పర్సన్ ఈదల ఈశ్వరకుమార్, లయన్స్ రీజియన్ చైర్మన్ చిత్తులూరి వీర్రాజు (రాజా)లు పాల్గొని ట్రఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలు కూడా అవసరమన్నారు. శారీరక, మానసిక వికాశంతో పాటు ప్రస్తుతం కరాటే క్రీడను ఒలింపిక్ లో కూడా చేర్చినందున దానిలో ప్రతిభను కనపరిచిన విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పిస్తున్నట్టు చెప్పారు. దానికి ప్రతి విద్యార్థి ప్రయత్నించాలన్నారు. అలాగే ప్రస్తుతం ఆవిష్కరిస్తున్న ఓవరాల్ చాంపియన్ షిప్ టీవీని సామర్లకోట విద్యార్థులు కైవశం చేసుకోవాలన్నారు. కాగా ఈ సందరంగా కోచ్ శంకర్ మాట్లాడుతూ ఏప్రిల్ 18న నిర్వహించే సౌతజోన్ గోరనమెంటులో 6 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు, కోచ్లు విచ్చేస్తున్నట్టు చెప్పారు. అలాగే గత ఆదివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన కలర్ బెల్ట్ గ్రేడింగు పరీక్షలో సుమారు వందమంది విద్యార్ధులను, సామర్లకోట, కాకినాడల నుంచి తీసుకెళ్ళగా వారిలో సామర్లకోట విద్యార్థులు 34 మంది అత్యంత ప్రతిభను కనపరచి పెద్దగ్రడ్ బెల్టులు, సాధించినట్టు ఆయన చెప్పారు ఈ సందర్భంగా తొలుత విద్యార్థులకు వారు సాధించిన బెల్టులు, సర్టిఫికెట్లను అందించి లయన్స్ నాయకులు అభినందించారు. అనంతరం టోర్నమెంటు ఓవరాల్ ఛాంపియన్ షిప్ ట్రోఫీని వారు ఆవిష్కరించి ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో ఇంకా లయన్స్ పాస్ట్ ప్రెసిడెంట్ గుండు శంకర్రావు, టోర్నమెంటు కమిటీ సభ్యులు బి రామారావు, బి సత్యనారాయణ, ఎం లోవరాజు, టివి రమణ, అధిక సంఖ్యలో కరాటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...