Followers

దళిత బిడ్డకు ఘన నివాళులు..

 దళిత బిడ్డకు ఘన నివాళులు..

బంగారు లక్ష్మణ్ 84వ జయంతి వేడుకలు...

ఘనంగా నివాళులు అర్పించిన బీజేపీ శ్రేణులు..

కుత్బుల్లాపూర్, పెన్ పవర్

ప్రగతి నగర్ బిజెపి కార్యాలయంలో తెలంగాణ దళిత బిడ్డ కార్మిక నాయకుడు మాజీ మంత్రి మాజీ భాజపా జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ 84 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.. బంగారు లక్ష్మణ్ ను స్మరించుకొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి మౌనం పాటించారు.. ఈ సందర్భంగా కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ మాట్లాడుతూ బంగారు లక్ష్మణ్ తెలంగాణ దళిత బిడ్డ మరియు వివిధ కంపెనీలలో కార్మిక నాయకుడిగా ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం కాకుండా, జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో జైలుకు వెళ్ళారని, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మరియు వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు చేపట్టిన తెలంగాణ ముద్దుబిడ్డ బంగారు లక్ష్మణ్ అని సతీష్ కొనియాడారు.. తెలంగాణ మారుమూల ప్రాంతం నుండి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎదగడం అందరికీ స్ఫూర్తిదాయకమని, గుర్తుచేసుకున్నారు.. తన కుటుంబాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం తయారుచేయడం గొప్ప విశిష్టత అని , దళిత ముద్దు బిడ్డ అయిన గల్లీ నుండి ఢిల్లీ వరకు వివిధ బాధ్యతలు నిర్వర్తించిన నిరాడంబరత, సమాజ శ్రేయస్సు, దేశం పట్ల అభిమానం నేటి యువతకి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.., వారి అడుగుజాడల్లో అందరు నడుచుకోవాలని , యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు వారితో కలిసి పని చేయడం, వారిని వివిధ సామాజిక సమరసత సదస్సులో కి ఆహ్వానించి, సమసమాజ స్థాపనకి ఉత్తేజ పరిచే వారి ఉపన్యాసాలు మాలాంటి వారికి ప్రేరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టి మోర్చా అధ్యక్షులు రామచంద్రనాయక్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి నరేంద్ర చౌదరి, కార్యదర్శి అనిత ,ఓబీసీ మోర్చా అధ్యక్షులు మదన్ గౌడ్, బీజేవైఎం అధ్యక్షులు రవీంద్ర, కార్యవర్గ సభ్యులు నవ్య, రెండో డివిజన్ అధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...