జన్మదిన సందర్భంగా పండ్లు పంపిణీ చేస్తున్న బీజేపీ నాయకులు
ఇంద్రవెల్లి,పెన్ పవర్భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు మరప రాజు మాట్లాడుతూప్రజల కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ నేనున్నా అంటూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి పక్షాన నిలబడి ప్రతి సమస్యను తన సమస్యగా తీసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న మా ప్రియతమా నాయకురాలు నిండు నూరేళ్లు ఆయుఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, జీవితంలో ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని అన్నారు.అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కన్వీనర్ దీపక్ సింగ్ షేకవత్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు చంపత్ రావు,వైస్ ఎంపీపీ పి.గోపాల్ సింగ్,ఇంద్రవెల్లి మండల బీజేపీ అధ్యక్షుడు అరెళ్లి రాజలింగు,యువమోర్చా మండల అధ్యక్షుడు గిరి లహానే,ప్రధాన కార్యదర్శి గెడం భారత్,మండల బీజేపీ ఉపాధ్యక్షుడు భీంరావు, మండల నాయకులు మెస్రం జైరాం, శివకుమార్, కేంద్రే ప్రహ్లాద్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment