Followers

పుట్టిన గడ్డ రుణం తీర్చుకొనేందుకే ట్రస్ట్ స్థాపన

 పుట్టిన గడ్డ రుణం తీర్చుకొనేందుకే ట్రస్ట్ స్థాపన

సంపాదనలో కొంత భాగం ఖర్చు చేసేందుకే సేవ కార్యక్రమాలు

చిన్ననాటి కోరిక మేరకే సామూహిక వివాహా కార్యక్రమాలు

వేములవాడ,పెన్ పవర్

వేములవాడ నియోజకవర్గ మీడియా మిత్రుల ఆత్మీయ సమావేశంలో సామూహిక వివాహల పోస్టర్ ఆవిష్కరించిన -- టి ఆర్ కె ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ పుట్టిన గడ్డ రుణం తీర్చుకొనేందుకే టి.ఆర్.కె చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని టి ఆర్ కె చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మరికొద్ది రోజుల్లో నిర్వహించనున్న సామూహిక వివాహాల పోస్టర్ ను ఆదివారం వేములవాడ పట్టణములోని మహా లింగేశ్వర ఫంక్షన్ హాల్ లో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తోట రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎంతో సంపాదిస్తారు కానీ అందులో నుండి కొంత మంది మాత్రమే ఖర్చు చేసేందుకు ముందుకు వస్తారని, ఈ క్రమంలోనే పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ట్రస్ట్ స్థాపించి, కష్టపడాలి పది మందికి సాయం చేయాలి అనే నినాదంతో సేవ కార్యక్రమాలు చేస్తున్నాని, అలాగే చిన్ననాటి కోరిక మేరకు ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నిరుపేద వంద మంది ఆడపిల్లల పెళ్లిళ్లు అన్ని మతాల వారికి వారి వారి సంప్రదాయాల్లో చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఉగాది కొత్త పంచాంగంలో ఈ మహోత్తర కార్యక్రమం నిర్వహిస్తామని, దీనికి మీ వంతు సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 

సమాచారం అందించడంలో మీడియా పాత్ర ఎంతో కీలకం

ప్రజలకు సమాచారం చేరవేయడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని టి ఆర్ కె ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ అన్నారు. సామూహిక వివాహ కరపత్రం ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎంతో కృషి చేస్తున్నారని, ఎండనక, వాననక కష్టపడుతూ సమాజం అభివృద్ధిలో జర్నలిస్టులు కీలకంగా వ్యవహరిస్తున్నారని, అలాగే తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి, నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ కె ట్రస్ట్ డైరెక్టర్ మోట్టల మహేష్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి నాయిని శేఖర్, ఎంక్వయిరీ టీం, వర్కింగ్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...