మలబార్ గోల్డ్ డైమండ్స్ లో హెరిటేజ్ జ్యువెలరీ షో
కూకట్ పల్లి,పెన్ పవర్బంగారు, వజ్రాల నగల వ్యాపారంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ కూకట్‌పల్లిషోరంలో హెరిటేజ్ జ్యువలరీ షోను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి జోయమిర్జా హాజరై జ్యువలరి షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశిష్ట ఆభరణాల ప్రదర్శనలో భాగంగా బంగారు ఆభరణాలు, యాంటిక్ ఆభరణాలు, అద్వితీయమైన కళానైపుణ్యంతో, హుందాతనంగా ఉండే ఆభరణాలు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శన ఈనెల పద్నాలుగో తరీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు నిర్వహిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ నిర్వాహకులు తెలియజేసారు.
అలాగే ఈ సంస్థ తమ వార్షిక ఆదాయం నుండి కొంతమొత్తం ఆదాయాన్ని సంస్థాగత బాధ్యత రూపంలో ఆరోగ్యం, ఉచిత విద్య, నిరుపేదలకు గృహనిర్మాణం, మహిళ సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నట్లు స్టోర్ హెడ్ సానిబ్ వివరించారు.


No comments:
Post a Comment