పూలాజీ బాబా బాటలో నడవాలి...
ఇంద్రవెల్లి,పెన్ పవర్పూలాజీబాబా సూచించిన ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మండల ఎంపీపీ పోటె శోభాబాయి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో సద్గురు పూలాజీబాబా ధ్యాన మందిరం 13వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ వ్యసనాలకు దూరంగా ఉండి, పూలాజీబాబా సూచించిన భక్తిభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ధ్యాన మందిరం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఆంద్ ఉద్యోగులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాకురే రాందాస్, ఆదివాసీ ఆంద్ సంఘం జిల్లా అధ్యక్షులు ముఖడే విష్ణు, పోటె సాయినాథ్, పుడంలిక్, బన్సీలాల్, డి. మాధవ్ టీచర్, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment