ఐకమత్యంగా ఉంటే గెలుపు మనదే
గుడీహత్నూర్,పెన్ పవర్వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు అంతా ఐకమత్యంగా ఉండి కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని బజార్ హత్నూర్ జడ్పిటిసి సభ్యులు మల్లెపూల నర్సయ్య అన్నారు. ఆదివారం మంచిర్యాలలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు నివాసంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి సమర్థుడైన అభ్యర్థిగా తాంసి మండలానికి చెందిన వైద్యుడు మల్లెల అశోక్ అన్ని విధాలా అర్హుడని,ఆయనకు టికెట్ కేటాయిస్తే నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఐకమత్యంగా పని చేసి బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకతి రవీందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ షంసుద్దీన్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment