పోలీసులు వాహన తనిఖీ
చిన్నగూడూరు, పెన్ పవర్మండల కేంద్రం శివారులో జయ్యారం కాసు రోడ్డు వద్ద మంగళవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీ చేపట్టడం జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. అనంతరం ఎస్సై విజయ రామ్ కుమార్ మాట్లాడుతూ... మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది రాము, నరేష్, తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment