Followers

అబ్బాయి పాలెంలో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు

అబ్బాయి పాలెంలో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు

పెన్పవర్, మరిపెడ 

మరిపెడ మండలం అబ్బాయి పాలెం గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం (సి ఐ టి యు)ఆధ్వర్యంలో మంగళవారం భగత్ సింగ్ 90 వర్ధంతి  సందర్భంగా  నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్న పిల్లలకు, వృద్దులకు పండ్లు పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కొండ ఉప్పలయ్య మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలంలో భగత్ సింగ్ చేసిన పోరాటం విరోచిత మైందని ఆయన పోరాట స్ఫూర్తితో చాలా మంది యువకులు స్వతంత్ర ఉద్యమంలో భాగస్వాములు అయ్యారని అందులో భాగంగానే ఆయన సహచరులు రాజగురువు, సుఖదేవ్ లు భగత్ సింగ్ తో కలిసి దేశం కోసం ... సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగిన వీరోచిత పోరాటంలో ఆనాటి పాలకులు భగత్ సింగ్ ను ఉరి తీయడం జరిగిందన్నారు. 23 ఏళ్ల వయసులోనే లే  ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారని అలాంటి మహనీయుల త్యాగ ఫలితమే ఈరోజు మనకు స్వతంత్రం లభించిందని కొనియాడారు. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి నేటి యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నందిపాటి వెంకన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు సైదులు, జినక వీరయ్య, తీగల యాకయ్య, రామచంద్రు, జినక మల్లయ్య, ఎర్ర వెంకన్న, జిన్న నాగయ్య, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రాజు, జినక బాబు, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...