విలేకరినీ చంపుతామని బెదిరించిన వ్యక్తులను అరెస్ట్ చేయాలి.
కళ్యాణి ఖని, పెన్ పవర్వృత్తిరీత్యా ఫోటో సేకరించుకుని వచ్చిన మంచిర్యాల జిల్లా కు చెందిన ప్రజా పాలన బ్యూరో ఇంచార్జ్ వెంకటస్వామి పై రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన సభ్యులు ఫోన్ చేసి చంపుతా అని బెదిరించడం పై మందమర్రి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తున్నామని, వీరిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్ చేయాలని గురువారం మందమర్రి ప్రెస్ క్లబ్ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మందమర్రి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సలామొద్దీన్ మాట్లాడుతూ. పత్రికా విలేఖరిగా ప్రజల సమస్యల కోసం వెళ్లడం వార్త సేకరించడం అది ప్రతి విలేకరి ఒక వృత్తి ధర్మం అని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో భౌతిక దాడులకు దిగడం, ఫోన్లలో బెదిరింపులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అని అన్నారు. వార్తా సేకరణను అడ్డుకుంటే వాస్తవాలు బయటకు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని నాలుగో స్తంభం.అయిన పత్రిక ను.కాపాడుకొవలసిన బాధ్యత అవసరం అందరిపై ఉందని అన్నారు. చంపుతానని బెదిరింపులు చేసిన వ్యక్తుల పై మంచిర్యాల పోలీసులు స్టేషన్ లో సంబంధించిన విలేకరి ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పత్రిక విలేకరులకు , విలేఖరి వృత్తి కి రక్షణ కల్పించాలని కోరారు. రాష్ట్రంలో అనేకమంది విలేకరులపై దాడులు జరుగుతున్నాయని ఈ దాడులను మందమర్రి ప్రెస్ క్లబ్ ఖండిస్తుంది అని ఆయన అన్నారు బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి లను కఠినంగా శిక్షించాలని లేని ఎడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

No comments:
Post a Comment