Followers

మృత్యు వాత పడుతున్న రాజన్న కోడెలు

 మృత్యు వాత పడుతున్న రాజన్న కోడెలు...


వేములవాడ, పెన్ పవర్

దక్షిణ కాశీగా సుప్రసిద్ద పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కి భక్తులు సమర్పించుకునే కోడెలు మృత్యవాత పడుతున్నాయి. గురువారము ఉదయం తిప్పాపుర్ గోశాలలో 5 కొడేలు అనారోగ్యంతో మృతి చెందాయి. కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించే రాజన్న కోడెలు అధికారుల నిర్లక్ష్యంతో పోషక ఆహారం అందక బక్కచిక్కిపోయి మృతి వాత పడుతున్నట్లు  ధార్మిక సంస్థలు, విశ్వహింద్ పరిషత్, బజరంగ్ దళ్  నాయకులు ఆరోపిస్తున్నారు.మృతి చెందిన కోడెలను గోశాల నిర్వాహకులు వరి గడ్డిలో దాచెందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కోడెల మృతికి పరోక్షంగా కారణమైన సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...