బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కు సంపూర్ణ మద్దతు
పెన్ పవర్, కందుకూరు
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిరసిస్తూ మార్చి 15,16 తేదీల్లో జరుగుతున్న బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెకు సిపిఎం, సిపిఐ, భీమ్ ఆర్మీ పార్టీలు, సిఐటియు, ఏఐటీయూసీ సంఘాలు తన సంపూర్ణ మద్దతును తెలియజేశాయి. శనివారం పట్టణంలోని సుందరయ్య భవన్ లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె కు సంఘీభావంగా సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి వెంకటేశ్వర్లు,సీఐటీయూ జిల్లా కార్యదర్శి జీవీబీ కుమార్, సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి పి మాలకొండయ్య, ఏఐటీయూసీ జజిల్లా అధ్యక్షులు బి సురేష్ బాబు, బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు పాలేటి కోటేశ్వరరావు, రిటైర్డ్ వార్డెన్ బి వెంకటేశ్వర్లు, భీమ్ ఆర్మీ పార్టీ నాయకులు కసుకుర్తి మాల్యాద్రి, కెవిపిఎస్ నాయకులుమెన్నెం. రమేష్ బాబు లు పాల్గొని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సమావేశంలో కందుకూరు బ్యాంక్ ఉద్యోగ సంఘం కందుకూరు పట్టణ నాయకులు సత్యన్నారాయణ,సాయి సురేష్, వలేటివారిపాలెం బ్యాంక్ ఉద్యోగులు నరేష్, చైతన్య కుమార్, పొన్నలూరు బ్యాంక్ ఉద్యోగి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. సమ్మె సందర్భంగా కందుకూరు పట్టణం లో 15న స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద శిబిరం ఏర్పాటు, 16న పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు ప్రజలంతా సహకారం అందించాలని కోరారు.

No comments:
Post a Comment