Followers

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

 ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

పెన్ పవర్,ఆలమూరు 

   ఆదివారం జరుగు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి  వెల్లడించారు. మండల కేంద్రమైన ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఉదయం  8 గంటల నుండి  సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది అని  ఓటుహక్కు ను వినియోగించుకునే  ప్రతి ఒక్కరు ఎదో ఒక గుర్తింపు కార్డు ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో ఉన్న ఏటీఎం కార్డు కానీ తీసుకుని రావాలి అని  మండలంలో 71 ఓట్లకుగాను మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అమె తెలిపారు. ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను వెలుతురు, గాలి వంటివి ఉండేటట్లు చర్యలు తీసుకున్నారు. సబ్ కలెక్టర్ వెంట ఎంపీడీవో జేఏ ఝాన్సీ, తాసిల్దార్ లక్ష్మీపతి, మండల ప్రజాపరిషత్ పరిపాలన అధికారి టీవీ సురేందర్రెడ్డి, ఆర్ఐ జానకి  రాఘవ, డిప్యూటీ తహశీల్దార్ జానకీ రామయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...