కోవిడ్ వ్యాక్సిన్ తో వృద్ధులకు ఉపయోగం
తాళ్ళూరు,పెన్ పవర్తాళ్ళూరు మండలం కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు పడవద్దని వైద్యాధికారి ఖద్దర్ మస్తాన్ బీ తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 60 సంవత్సరాలు దాటిన 34 మందికి కోవిడ్ టీకాలు శనివారం వేశారు.వ్యాక్సిన్ తీసుకుంటున్న వారంతా ఆరోగ్యం గా ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 45 సంవత్సరాల వయస్సు దాటి,బీపీ,షుగర్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు,60 సంవత్సరాలు దాటిన వారందరికి కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఆమె తెలిపారు. వ్యాక్సిన్ కు వచ్చే వారు ఆధార్ కార్డు ,సెల్ ఫోన్ ను వెంట తెచ్చుకోవాలని అన్నారు. కోవిడ్ యాప్ ద్వారా అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ చేసి వ్యాక్సిన్ వేస్తున్నట్లు డాక్టర్ తెలిపారు.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

No comments:
Post a Comment