బడి రుణం తీర్చుకుంటున్నాము పూర్వం విద్యార్థులు
పెన్ పవర్,ఆలమూరులక్షలు పోసి కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాలంటే సామాన్యులకు ఎంతో భారం కార్పొరేట్ పాఠశాలల్లో ఆర్భాటాల్లో మునిగి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులుండవనే అపోహలు ఉన్నాయి చదువు, ఆటలు, కళలు అన్నింటితో పాటు కార్పొరేట్ పాఠశాలలను మించేలా ఇక్కడ సదుపాయాలు సమకూర్చుతున్నారు. ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో శ్రీ ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-03 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు శనివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బడి రుణం తీర్చుకోవడంతో పాటు బాలల భవితకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో తలో చేయి వేసి బడిని అభివృద్ధి బాట పట్టించేందుకు పాఠశాలల్లో చదివే విద్యార్థినుల సౌకర్యార్థం పాఠశాలల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రంధాలయంలో సుమారుగా 50 వేల రూపాయల ఖర్చుతో కబోర్డులను (బీరువాలు) అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసి వాటిని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ గ్రామ మాజీ సర్పంచ్ ద్వారంపూడి నాగేంద్ర సత్యన్నారాయణ రెడ్డి (దొరబాబు) ప్రారంభించారు.
అనంతరం దొరబాబును పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ద్వారంపూడి విక్రమ్ రెడ్డి, నల్లమిల్లి రామారెడ్డి, 2002-03 విద్యార్థులు, ఆ నాటి ఉపాధ్యాయులు, ప్రస్తుత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తదినతరం దొరబాబు ని పూర్వ ఉపాధ్యాయులని ఘనంగా సన్మానించితిరి.


No comments:
Post a Comment