ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి:మేడ్చల్ కలెక్టర్
*శాసనమండలి ఎన్నికలకు అంతా సిద్దం
ఓటు వేసేందుకు ఫొటో గుర్తింపుకార్డు తప్పనిసరిగా ఉండాలి..*
ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ శ్వేతా మహంతి..
మేడ్చల్ ,పెన్ పవర్
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది సమర్ధవంతంగా తమ విధులను నిర్వహించాలని, ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ముందస్తుగానే అన్ని రకాల చర్యలు చేపట్టామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు.. జిల్లా వ్యాప్తంగా ఆదివారం శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం కలెక్టర్ మల్కాజిగిరి సైనిక్ పురిలో ఉన్న భవన్స్ రామకృష్ణ విద్యాలయం, అబ్దుల్ కలామ్ ఆడిటోరియం, ద్రోణాచార్య స్పోర్ట్స్ కాంప్లెక్స్ లలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ... ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన బందోబస్తును కల్పించామన్నారు. ఆయా ఎన్నికల కేంద్రాలకు వెళ్ళే సిబ్బంది తమతో పాటు బ్యాలెట్ బాక్సులు, ఇంకు, పోలింగ్ స్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు, స్టాంప్లు, స్టాంప్ ప్యాడ్లతో పాటు అవసరమైన ఎన్నికల సామాగ్రిని సరిగ్గా పరిశీలించుకోవాలని... ఏమైనా అవసరమైతే సంబంధిత అధికారుల వద్ద నుంచి తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యా స్టింగ్ తో పాటు వీడియో చిత్రీకరిస్తున్నందున ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే తెలిసిపోతుందన్నారు. అలాగే ప్రస్తుతం పట్టభద్రుల ఎన్నికల్లో జంబో బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నందున ఎన్నికల ఏజెంట్లకు వీటి విషయంపై ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ముందుగానే వివరించాలని, వారికి ఏమైనా సందేహాలు వస్తే వివరించాలని కలెక్టర్ శ్వేతా మహంతి సూచించారు. అలాగే ఎన్నికల సమయం ముగిసే వరకు సిబ్బంది తమ విధులు నిర్వహించడంతో పాటు చివరి సమయంలో వచ్చిన వారికి సైతం ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు జిల్లాలో మొత్తం 1,31,000 మంది ఓటర్లు ఉండగా... 198 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించినారు. దీంతో పాటు 74 పోలింగ్ లొకేషన్లు, 41 రూట్లలో 41 సెక్టోరియల్ అధికారులు ఉంటారని వివరించారు.. ఎన్నికల సందర్భంగా 198 పోలింగ్ కేంద్రాలకు గాను 198 ప్రిసైడింగ్ అధికారులు, 198 అదనపు ప్రిసైడింగ్ అధికారులు, 396 మంది ఇతర పోలింగ్ అధికారులు తమ విధులను నిర్వహించడంతో పాటు 198 సూక్ష్మ పరిశీలకులు ..198 మంది వెబ్ క్యా స్టింగ్ విద్యార్థులు.. నిర్వహిస్తారని వీరందరికీ అదనంగా మరో పది శాతం సిబ్బందిని అందుబాటులో ఉంటారని కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు వచ్చే ప్రతి పట్టభద్రులు పోలింగ్ కేంద్రానికి ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లాల్సి ఉంటుందని... వాటిలో ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డిపార్ట్‌మెంట్ గుర్తింపు కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, పట్టాదారు పాసు పుస్తకం, ఫొటో ఉన్న బ్యాంకు ఏటీఎం కార్డుల్లో ఏదో ఒక ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకువస్తేనే ఓటు వేసేందుకు అనుమతించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.. ఎన్నికల సమయంలో సిబ్బంది అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎన్నికల కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని... ఈ విషయంలో ప్రిసైడింగ్ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపినారు. వివరించినారు. పోలింగ్ బూత్లలో ఎక్కువ మంది ఉండకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్లు విద్యాసాగర్, డీఆర్వో లింగ్యానాయక్, ఏవో వెంకటేశ్వర్లు, ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.



No comments:
Post a Comment