అన్ని దానాల కన్నా రక్త దానం గొప్పది
మందమర్రి, పెన్ పవర్
అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది మందమర్రి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఏరియాలోని ఎంవిటిసి కార్యాలయంలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణిలోని యువ కార్మికులు 45 మంది రక్తదానం చేయడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. 2019 నుండి 2021 మార్చి 13 వరకు 26 రక్తదాన శిబిరాలు నిర్వహించి 1706 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఆయన వివరించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. సేకరించిన రక్తాన్ని మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ వారికి అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ వరప్రసాద్, ఎంపీటీసీ డిజిఎం కృష్ణారావు, ట్రైనింగ్ అధికారి అశోక్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్, బెల్లంపల్లి సబ్ డివిజన్ సభ్యుడు సూరం లక్ష్మీనారాయణ, రక్తనిధి వైద్యులు అజీమోద్దీన్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment