శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామి జాతర అత్యంత వైభవంగా జరిగింది ..
బెల్లంపల్లి రూరల్,పెన్ పవర్
భక్తులు ఉదయం నుంచే జాతరకు తరలివచ్చారు. మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన బుగ్గ జాతరకు వచ్చిన భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై స్వయంగా వెలిసిన గంగాజలాన్ని తలపై చల్లుకుని దైవ దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బారీకేడ్లు నిర్మించారు.జాతరకు సుమారు లక్షకు పైగా భక్తులు దర్శించుకుంటారని అధికారులు అంచనా వేశారు. బెల్లంపల్లి పాత బస్టాండ్ నుంచి బుగ్గ దేవాలయం వరకు మంచిర్యాల ఆర్టీసీ డిపో నుంచి బస్సులు ఏర్పాట్లు చేశారు. జాతరను పురస్కరించుకుని స్వచ్ఛంద సేవా సంస్థలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు...

No comments:
Post a Comment