మండల పరిషత్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి
పెన్ పవర్,ఆత్రేయపురం
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎంపీడీవో నాతి బుజ్జి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉనికి లేకుండా ఉమ్మడి మద్రాసు లో తెలుగు వారికి ఒక ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని పోరాడి అందుకోసం ఆమరణ నిరాహార దీక్షలో తన ప్రాణాలు వదిలిన అమరజీవి ఆంధ్ర అవతరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి త్యాగమూర్తి ఆయన చిరకాలం తెలుగు ప్రజల గుండెల్లో ఉంటారు అని ఆమె కొనియాడారు ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాధికారి శ్రీనివాస్ కార్యాలయ సిబ్బంది భాగ్యలక్ష్మి. వల్లి విద్యా శాఖ సిబ్బంది కార్యదర్శులు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఎంపీడీవో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని సచివాలయ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగినది.

No comments:
Post a Comment