కో వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోండి
పెన్ పవర్, వరదయ్యపాలెం
వరదయ్యపాలెం, చిన్నపాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంబమైనట్లు వైద్యాధికారి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 60ఏళ్లు పైబడిన వృద్దులందరికీ, 45ఏళ్ల నుంచి 59ఏళ్ల లోపు వారికి ప్రత్యేకంగా మధుమేహం (సుగర్) బీపీ, క్యాన్సర్, గుండె వ్యాధులు ఇతర దీర్జకాలిక వ్యాధులు ఉన్న వారికి మాత్రం వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి ఈ అవకాశాన్ని సద్వినియగం చేసుకోవాలని కోరారు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, ఎవరూ అపోహలతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు
No comments:
Post a Comment