మహిళలకు పెద్ద పీట వేయడం హర్షణీయం
ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన ....కొణతాల సీతారాంవిశాఖపట్నం, పెన్ పవర్
మహిళలకు పెద్ద పీట వేసి మేయర్ లు, మునిసిపల్ చైర్మన్లు గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం అభినందనీయమని మహిళలకు పెద్ద పీట వేయడం పట్ల మహిళా సాధికారత చేకూరుతుందని అన్నారు.పదవులను అలంకిరించిన వారు పరిపాలనా సాధికారత అంశంలో సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా తయారు కావాలని సూచించారు. ప్రభుత్వం చేసే మంచిని మంచి అని తప్పులు చేస్తే అవి తప్పు అని జై అనకాపల్లి సేన ఎప్పుడు తేల్చి చెప్తుందని స్ఫష్టం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మేయర్, చైర్మన్ లుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
No comments:
Post a Comment