తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని అవమానిస్తారా?
గ్రేటర్ ఎన్నికలు ముగిసినా దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి తొలగని ముసుగుఆగ్రహం చేసిన తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
మహారాణి పేట, పెన్ పవర్
జూనియర్ ఎన్టీఆర్ విశాఖ వచ్చి తాతకు నివాళులు అర్పించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.గ్రేటర్ ఎన్నికలు ముగిసినా దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి తొలగని ముసుగు ఆగ్రహం చేసిన తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్. జీవీఎంసీ ఎన్నికలు ముగిసి కౌన్సిల్ కొలువు దీరినా మేయర్ ప్రమాణ స్వీకారం చేసినా రామకృష్ణ బీచ్ లో ని దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి ఉన్న ముసుగును అధికార యంత్రాంగం తొలగించక పోవడంపై తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం ఆ మహనీయుని విగ్రహం వద్దకు చేరుకున్నారు. ముసుగు తొలగించి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ వుడా పార్క్ సమీపంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం సహా నగరంలో అన్ని విగ్రహాలకు ముసుగులు తొలగించినప్పటికీ రామకృష్ణ బీచ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ముసుగు తొలగించక పోవడం ఏంటని ప్రశ్నించారు. ఎందుకు బాధ్యులైన సంబంధిత జివిఎంసి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసిపి నాయకులు, కార్పొరేటర్లు వైయస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి కౌన్సిల్ హాల్ కి వెళ్లారని ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు విశాఖ నగర ప్రజలు 30 మంది తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ లను గెలిపించారన్నారు. అయినా ఆ పార్టీకి చెందిన ఏ ఒక్కరూ కూడా ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న ముసుగు తొలగించి శుభ్రం చేయడం పై శ్రద్ధ చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తెలుగుదేశం నాయకుల పట్ల టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి జరిగిన ఈ అవమానానికి ఆయన కుటుంబ సభ్యులు విశాఖ చేరుకుని ఆయన ఆత్మ శాంతికి కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులు అర్పించాలని కోరారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులలో అందరికంటే ఎక్కువగా ప్రజామోదం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ విశాఖ వచ్చి తాతకు నివాళులు అర్పించాలని ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో కె.రమేష్ బాబు, డాక్టర్ పి.జయశ్రీ, వంశీ,ఎస్.హరి,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment