దళిత బస్తీ భూములపై సర్వే
బేల, పెన్ పవర్
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో ని దళితుల కోసం కేటాయించిన దళితబస్తీ భూముల సర్వే మంగళవారం బెదొడ గ్రామ శివారులో ఎంసీ గోవిందరావు భూ సర్వే నిర్వహించారు. గ్రామంలో ఎన్ని దళిత కుటుంబాలకు దళితబస్తీ కింద భూములు పంపిణీ చేయాలో దళిత బస్తీ లబ్ధిదారులకు సరిపడ భూమి ఉందో లేదో అనే విషయం తెలుసుకుని భూ సర్వే నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర కార్యదర్శి కదరపు ప్రవీణ్, గ్రామ దళిత మహిళలు తదితరులు ఉన్నారు.


No comments:
Post a Comment