రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
గుడిహత్నూర్ , పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని గుడిహత్నూర్ ఎస్సై ఎల్. ప్రవీణ్ అన్నారు. మంగళవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో బస్ స్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై వేగ నియంత్రణ స్ప్రింగ్ కంట్రోల్ పోల్స్ పోలీసులు ఏర్పాటు చేశారు. మండలకేంద్రం గుండా వెళ్తున్న జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకోసమే వేగ నియంత్రణలను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా హైదరాబాద్–నాగ్ పూర్ నేషనల్ హైవేపై వేగ నియంత్రణకై ప్లాస్టిక్ పోల్స్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్లాస్టిక్ పోల్స్ వేగంగా దూసుకొచ్చే వాహనాలను నియంత్రించేందుకు కొంత మేరకు ఉపయోగపడుతాయని పోలీసులు తెలుపుతున్నారు. మండల కేంద్రం గుండా వెళ్తున్న హైవేపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా యి.దీనికి ప్రధాన కారణం వాహనాలు అతివేగంగా రావడమేనని పోలీసు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో నేషనల్ హైవే అధికారులతో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఈ మేరకు ప్రమాదకర కూడళ్లను తెలియజేస్తూ చర్యలు తీసుకున్నారు.మూడు అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్లాస్టిక్ పోల్స్ వరుసగా నాలుగైదు వేయడంతో వేగంగా వచ్చే వాహనాల స్పీడ్‌ను కంట్రోలు చేస్తున్నాయి. ప్రమాదాలను వందశాతం నియంత్రించ లేకపోయినప్పటికీ, ఎంతో కొంత మేర వేగం తగ్గించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.జాతీయ రహదారిపై అతి ప్రమాదకరమైన ఆరేడు ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

No comments:
Post a Comment