Followers

కార్పొరేటర్ లతో జోనల్ కమిషనర్ సమావేశం

 కార్పొరేటర్ లతో జోనల్ కమిషనర్ సమావేశం

కూకట్ పల్లి, పెన్ పవర్

మంగళవారం జోనల్ కమిషనర్ మమత ముసాపేటలోని తన కార్యాలయంలో పలు డివిజన్ లకు చెందిన కార్పొరేటర్ లు, ఉపకమిషనర్లు, సహాయ వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో వివిధ సర్కిళ్లలో చేపట్టిన చెత్తకుండీల తొలగింపులో భాగంగా వంద కేజీల పైబడిన చెత్తకుండీలు రోడ్లపై ఉండకుండా చూడాలని, చెత్తకుండీలు తొలగించిన ప్రాంతాలలో తిరిగి చెత్త వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణకు స్వచ్ఛ వాహనాలు పెంచాలని, కొన్ని ఇరుకుసందులో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొందని అలాంటి సంధులలోకి రిక్షాలు ఏర్పాటు చేయాలని, డంపింగ్ యార్డు వద్ద చెత్త తీసుకెళ్లిన వాహనాలు వెంటనే కాళీ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని తద్వారా స్వచ్ఛ వాహనాలు రెండో సారి కూడా చెత్త సేకరణకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అన్నారు. నూతన స్వచ్ఛ ఆటోలో రాగానే డివిజన్ల కార్పొరేటర్లను సంప్రదించి ఆటోలు కేటాయించవాల్సిందిగా వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటలు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నే శ్రీనివాసరావు, జూపల్లి కృష్ణారావు, రోజా రంగారావు, ఆవుల రవీందర్ రెడ్డి, ఉప కమిషనర్లు ప్రశాంతి, రవి కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...